అవగాహన లేక.. పోలింగ్ రోజు తిప్పలు

నిజాంసాగర్,(ఎల్లారెడ్డి)వెలుగు : ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి నుంచే  ఓటు వేసే సౌకర్యం కల్పించింది.  కానీ వృద్ధులను దివ్యాంగులను  అధికారులు గుర్తించి ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం కల్పించడంతో విఫలమయ్యారు. అవగాహన సదస్సులు కేవలం జిల్లా, మండల కేంద్రాల్లో మాత్రమే నిర్వహించి గ్రామాల్లో ఎలాంటి అవగాహన సదస్సులు చేపట్టలేదు.

నిజాం సాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఒక వృద్ధురాలిని సైకిల్ పై ముగ్గురు తీసుకెళ్తూ వెలుగు కెమెరాకు చిక్కారు.  ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉందని చెప్పగా.. అలాంటి సమాచారం ఏమీ మాకు తెలియదని చెప్పారు.