Irrigation projects updates : భారీ వర్షాలతో తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల వివరాలు ఇవే!

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మొదట భారీ వర్షాలు నమోదైయ్యాయి. తర్వాత ఉత్తర, ఈశాన్య జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయి. 

Also Read:-ఏపీలో మళ్ళీ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఇప్పటికీ కూడా వరద నీరు జలాశాయాల్లోకి వచ్చి చేరుతుంది. మరో నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణ, గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. సెప్టెంబర్ 8 (ఆదివారం) ఉదయం 8 గంటల సమయానికి రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

నిర్మల్ జిల్లా : కడెం ప్రాజెక్ట్

  • 3 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

  • ఇన్ ఫ్లో 10920 క్యూసెక్కులు 

  • ఔట్ ఫ్లో  12055 క్యూసెక్కులు

  • పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (నీటి సామర్థ్యం  7.6 టీఎంసీలు)

  • ప్రస్తుత నీటిమట్టం 697 అడుగులు (6.9 టీఎంసీలు నీరు ప్రాజెక్టులో ఉంది)


నిజామాబాద్ జిల్లా : శ్రీరాంసాగర్

  • శ్రీరాంసాగర్ 16 గేట్ల ఎత్తివేత

  • ఇన్ ఫ్లో 75, 881క్యూసెక్కులు

  • ఔట్ ఫ్లో 75, 881క్యూసెక్కులు

  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5టిఎంసీలు)

  • ప్రస్తుత నీటిమట్టం 1,090.90 అడుగులు (80.053టీఎంసీల నీరు ఉంది)

కామారెడ్డి : నిజాంసాగర్‌కు కొనసాగుతున్న  వరద 

  • ఇన్ ఫ్లో 33,000 క్యూసెక్కులు

  • పూర్తిస్థాయి నీటిమట్టం 1,405.00(నీటి సామర్థ్యం 17.802 టీఎంసీ లు )

  • ప్రస్తుతం 1404.52అడుగులు( ప్రస్తుతం 17.108 టీఎంసీ లు)

  • 5 గేట్ల ద్వారా 36,500 క్యూసెక్కుల మీరు మంజీర  నదిలో వదులుతున్నారు.

నల్లగొండ జిల్లా :  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 

  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద.

  • 24 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేత

  • ఇన్ ఫ్లో :-  2,99,053 క్యూసెక్కులు.

  • ఔట్ ఫ్లో :- 2,88,066 క్యూసెక్కులు.

  • పూర్తి స్థాయి నీటి మట్టం :- 590 అడుగులు ( పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312 టీఎంసీలు)

  • ప్రస్తుత నీటి మట్టం :- 588.90 అడుగులు (ప్రస్తుతం- 308.7614 టీఎంసీల నీరు ప్రాజెక్ట్ లో ఉంది)

మంచిర్యాల జిల్లా: 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు స్వల్పంగా పెరుగుతున్న వరద 

  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టిఎంసి కాగా ప్రస్తుత నీటిమట్టం 20.0087 టీఎంసీల నీరు ఉంది.

  • ఇన్ ఫ్లో : 34వేల 128 క్యూసెక్కులు 

  • ఔట్ ఫ్లో : 34వేల128 క్యూసెక్కులు 

  • మొత్తం 62 గేట్లకుగాను 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు

సంగారెడ్డి జిల్లా: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

  • 6,11 వ గేట్ల ద్వారా 16,809 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

  • జల విద్యుత్ కేంద్రం ద్వారా 2530 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

  • ఇన్ ఫ్లో 16, 809 క్యూసెక్కులు

  • టోటల్ ఔట్ ఫ్లో 19,740 క్యూసెక్కులు

కరీంనగర్: లోయర్ మానేరు డ్యాం స్టేటస్ 

  • ఇన్ ఫ్లో :- 5, 714 క్యూసెక్కులు

  • ఔట్ ఫ్లో :-  297 క్యూసెక్కులు

  • పూర్తి స్థాయి నీటి మట్టం :- 920 అడుగులు ( పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 24.034 TMC)

  • ప్రస్తుత నీటి మట్టం :- 916.00 అడుగులు (ప్రస్తుతం- 20.700 టీఎంసీల నీరు ప్రాజెక్ట్ లో ఉంది)

  • 280.480 మీటర్ల నీటి మట్టం సామర్థ్యానికి గాను 279.26 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉంది.