డబుల్​ ఇండ్లను మాకే కేటాయించాలి

  •  సిరిసిల్లలో దళితుల ఆందోళన 

సిరిసిల్ల టౌన్, వెలుగు : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన దళితులు సోమవారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇండ్ల జాగాలను డబుల్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొరవతో నాటి అధికారులు తీసుకున్నారన్నారు. ఆ స్థలంలో ఇండ్లు నిర్మించాక తమకు కాకుండా ఇతరులకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.