గ్రూప్ 1 మెయిన్స్​..టైమింగ్స్​లో మార్పు

  • అరగంట ముందుకు జరిపిన టీజీపీఎస్సీ
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష
  • అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఎగ్జామ్స్​

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమయంలో టీజీపీఎస్సీ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా మధ్యాహ్నం2:30 గంటల నుంచి సాయంత్ర 5:30 వరకు నిర్వహిస్తామని చెప్పిన కమిషన్.. తాజాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రీ పోన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికితోడు అభ్యర్థులు హాల్ టికెట్, ఆన్సర్ బుక్ లెట్ పై ఉన్న సూచనలు చదవాలని సూచించింది.

అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నెల 17న కమిషన్ వెబ్ సైట్​లో ఏడు పేపర్లకు సంబంధించిన శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్స్ పెడుతున్నట్టు వెల్లడించింది. హాల్ టికెట్ పై ఉన్న సూచనలనూ వెబ్ సైట్​లో పెడ్తామని తెలిపింది. మరిన్ని వివరాలకు  https://www.tspsc.gov.in వెబ్ సైట్ చూడాలని కోరింది.