Tesla Robotaxi : AI టెస్లా రోబో ట్యాక్సీ కారు.. డ్రైవర్ లేడు.. స్టీరింగ్ లేదు.. ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు..!

టెస్లా తన మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ రోబోటాక్సీని లాంచ్ చేశారు సీఈవో ఎలాన్ మస్క్. కెమెరా ఆధారిత టెస్లా విజన్ సిస్టమ్‌తో నడిచే ఈ రోబోటాక్సీ..AI , అటానమస్ వెహికల్ సిస్టమ్ లో సరికొత్త కంపెనీ విధానాన్ని చూపేందుకు నిర్మించిన సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్.

శనివారం అక్టోబర్ 11న కాలిఫోర్నియాలోని బర్బాంక్ లోని వార్నర్ బ్రదర్స్ స్డూడియోలో We Robot పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో టెస్లా సరికొత్త సెల్ఫ్ డ్రైవింగ్ రోబోటాక్సీ మోడల్ ను ప్రదర్శించారు. ఎలోన్ మస్క్ సెల్ఫ్ ట్రాన్స్ పోర్టింగ్ టెస్లా నెట్ వర్క్ టెస్లా నెట్‌వర్క్ ప్రత్యేక పై టెస్లా దృష్టి సారించిందని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. 

టెస్లా యజమానులు తమ కార్లను ఉపయోగించేటప్పుడు రోబోటాక్సీ సేవలను అందిస్తుంది. కొత్త రోబోటాక్సీ సీతాకోకచిలుక రెక్కల్లాగా డోర్స్ తో కాంపాక్ట్ టూ-సీటర్‌గా ఉంటుంది. వేమో , క్రూయిస్ వంటి స్వతహాగా నడిచే టాక్సీ సేవలతో నేరుగా పోటీ పడాలని లక్ష్యంగా ఈ రోబోటాక్సీని తీసుకువస్తున్నారు ఎలాన్ మస్క్. 

టెస్లా రోబో ట్యాక్సీని..2025 ఏడాది ప్రారంభంలోనే మార్కెట్ లోకి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఎలన్ మస్క్..EV అమ్మకాలు తగ్గిపోవటం.. ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో.. తన టెస్లా కార్ల తయారీలో కొత్త విధానాలకు రూపకల్పన చేశారు మస్క్. అందులో భాగంగానే టెస్లా రోబో ట్యాక్సీని తీసుకొస్తున్నారు. 

ఈ ట్యాక్సీలో స్టీరింగ్ ఉండదు.. డ్రైవర్ అవసరం లేదు.. జస్ట్ మొబైల్ ఉంటే చాలు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనేది మ్యాప్ చేసుకుంటే చాలు.. అక్కడికి తీసుకెళుతుంది ఈ టెస్లా రోబో ట్యాక్సీ.  

టెస్లా రోబోటాక్సీ చూడాలనే ఆసక్తి ఉన్నవారి కోసం టెస్లా తమ అధికారిక పేజీలో X (గతంలో Twitter) , YouTubeలో ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.