డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం.. ఉక్రెయినియన్లలో టెన్షన్​.. టెన్షన్​

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటో మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‎కు మద్దతు తగ్గించేందుకు ట్రంప్ ఒత్తిడి చేస్తాడేమో అని భయపడుతున్నారు. విక్టరీ స్పీచ్‎లో భాగంగా ఉక్రెయిన్, రష్యా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘యుద్ధాన్ని 24 గంటల్లో ముగిస్తా’’ అంటూ ట్రంప్ ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో ఎక్కడ తమపై ఆంక్షలు విధిస్తాడో అన్న భయం వారిలో నెలకొన్నది. ట్రంప్ విజయం.. ప్రపంచ అంతంలా కనిపిస్తున్నదని పలువురు ఉక్రెయిన్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా బలగాలను ఉప సంహరించుకుంటే తమ 
పరిస్థితి ఏంటని భయపడ్తున్నారు.