పేట- కొడంగల్- మక్తల్ స్కీం కింద పది రిజర్వాయర్లు

  • ఫేజ్-1 కింద పది చెరువుల ఎంపిక
  • అర టీఎంసీ నుంచి ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీతో నిర్మించే ప్లాన్​ 
  • భారీగా పెరగనున్న ఆయకట్టు

మహబూబ్​నగర్, వెలుగు : నారాయణపేట– కొడంగల్–-మక్తల్​ లిఫ్ట్​ స్కీమును రాష్ర్ట సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్కీం కింద 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు, నారాయణపేట ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు మొత్తం పది రిజర్వాయర్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫేజ్–-1లో ఈ మూడు నియోజకవర్గాల్లోని పది చెరువులను ఎంపిక చేసినసర్కారు.. త్వరలో రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.  

ఆ పది చెరువువు ఇవే.. 

నారాయణపేట- –కొడంగల్--–మక్తల్ ​లిఫ్ట్ ​స్కీం కింద ముంపును తగ్గించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు రాష్ర్ట సర్కారు పక్కా ప్లాన్​ చేస్తోంది. రిజర్వాయర్లను పది నుంచి 15 టీఎంసీలతో కాకుండా.. అర టీఎంసీ నుంచి ఒకటిన్నర  టీఎంసీ కెపాసిటీతో పది చిన్న చిన్న రిజర్వాయర్లుగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇటీవల ఫేజ్​–1 కింద పది చెరువులను గుర్తించింది. వీటిలో మక్తల్​ నియోజకవర్గంలోని ఊట్కూర్ చెరువు​, నారాయణపేట నియోజకవర్గంలోని జాజాపూర్ చెరువు​, పేరపళ్లలోని జాయమ్మ చెరువు

దామరగిద్ద మండలంలోని కాన్​కుర్తి చెరువు, కొడంగల్​ నియోజకవర్గంలోని దౌల్తాబాద్​ చెరువు, కొడంగల్​​ చెరువు, హస్నాబాద్ ​చెరువు, బొంరాస్​పేట చెరువు, లక్ష్మీపూర్ ​చెరువు, ఈర్లపల్లి చెరువులు ఉన్నాయి. ఇందులో కాన్​కుర్తి చెరువు మినహా అన్ని చెరువులు 0.2 టీఎంసీ నుంచి 0.4 టీఎంసీలలోపే ఉండడంతో ఏ చెరువు సామర్థ్యం ఎంత పెంచాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయాన్కి వచ్చినట్టు సమాచారం.  

ఐదు నుంచి వంద రెట్లు ...

రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్న పది చెరువుల పరిధిలో ప్రస్తుతం ఉన్న ఆయకట్టుతో పాటు అదనపు ఆయకట్టును నిర్దేశించారు. దీని ప్రకారం సుమారు ఐదు నుంచి వంద రెట్లు వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బొంరాస్​పేట చెరువు కింద పాత ఆయకట్టు 660 ఎకరాలుండగా, దీనిని 3,156 ఎకరాలకు పెంచనున్నారు. కొడంగల్ ​చెరువు కింద 478 ఎకరాలుండగా 5,596 ఎకరాలకు, హస్నాబాద్ ​చెరువు కింద 946  ఎకరాలు ఉండగా 7,226  ఎకరాలకు

దౌల్తాబాద్​ చెరువు కింద 665 ఎకరాలుండగా11,136 ఎకరాలకు, కానుకుర్తి చెరువు కింద 300 ఎకరాలు ఉండగా 29,451 ఎకరాలకు, జాయమ్మ చెరువు కింద 500 ఎకరాలు ఉండగా 4,236 ఎకరాలకు, ఊట్కూరు చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉండగా 16,193 ఎకరాలకు పెంచనున్నారు. మిగిలిన జాజాపూర్, లక్ష్మీపూర్, ఈర్లపల్లి చెరువుల పరిధిలో అదనపు ఆయకట్టు పెంచడంపై కసరత్తు చేస్తున్నారు. 

రాడార్​ సర్వే పూర్తి

ఇరిగేషన్​ఆఫీసర్లు కొద్ది రోజుల కిందట రిజర్వాయర్లు నిర్మిస్తున్న మక్తల్, నారాయణపేట, కొడంగల్​నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ​ద్వారా లైట్ డిటెక్షన్ అండ్​ రేంజింగ్​సర్వే (రాడార్​ సర్వే) పూర్తి చేశారు. దీని ద్వారా లాటిట్యూడ్, లాంగిట్యూడ్​ లెవెన్స్, నీటి లభ్యత ఉందా? అటవీ ప్రాంతం ఎంత ఉంది? భూమి ఎంత ఉంది? తదితర వివరాలు సేకరించారు. ఈ రిపోర్టును ఆ శాఖ ఉన్నతాధికారులకు అందించగా, వారు రాష్ర్ట సర్కారుకు పంపారు. దీంతో త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలువనున్నట్లు సమాచారం.

ఆదేశాలు వస్తే షురూ..

ఇటీవల మక్తల్, నారాయణపేట, కొడంగల్​నియోజకవర్గాల పరిధిలో రాడార్ ​సర్వే పూర్తయ్యింది.  ప్రతి చెరువుకు సంబంధించిన లాటిట్యూడ్​, లాంగిట్యూడ్​ సేకరించాం. ఉన్నతాధికారులకు రిపోర్ట్​ అందజేశాం. వారి ఆదేశాల మేరకు పనులు మెదలెడతాం.  

- కిరణ్​కుమార్, ఇరిగేషన్​ డీఈఈ, కొడంగల్