హిందువుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దివ్వెలు వెలిగించే ఈ దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతం, వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే కుబేర వ్రతాన్ని ఆచరిస్తే రుణ బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. నరకాసురుని వధించిన మర్నాడు దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. దీపావళి రోజు పీఠంపై కుబేర ప్రతిమను ఉంచాలి. దీపావళి రోజున కుబేరుడిని పూజించడం వలన ముఖ్యంగా పది ప్రయోజనాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. . .
దీపావళి రోజున కుబేరుడిని పూజించడం వలన కలిగే పది ప్రయోజనాలు
- 1. సంపద పెరగడం
- 2. అప్పుల బాధ నుంచి విముక్తి
- 3. వృత్తి, వ్యాపారం అభివృద్ది
- 4. బ్యాంక్ బ్యాలెన్స్ తో స్థిర, చరాస్థులు పెరగడం
- 5. వాహనాలు, ఇళ్లు, ఆస్థులు కొనుగోలు
- 6. ఆర్థికంగా భద్రత సాధించడం
- 7. ఆర్థికపరమైన ఇబ్బందులకు పరిష్కారం
- 8. ఇప్పటివరకు పడుతున్న సమస్యలకు పరిష్కారం లభించడం
- 9.ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
- 10. కోర్టు సమస్యలకు పరిష్కారం
దీపావళి రోజున9 నాణేలను తీసుకుని కుబేర ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పువ్వులను పయోగించుకోవచ్చు. కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం.