ముగిసిన గీతా జయంతి ఉత్సవాలు

వేములవాడ, వెలుగు: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేమలవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న  గీతా జయంతి ఉత్సవాలు గురువారం ముగిశాయి. అర్చకులు ఉదయమే స్వామివారికి మహాన్యాస పూర్వక  ఏకదశ రుద్రాభిషేకం నిర్వహించారు. చివరి రోజు ఆలయ నాగిరెడ్డి మంటపంలో గీతా హోమం, గీతా ప్రవచనాలు నిర్వహించి పూర్ణహుతితో ఉత్సవాలను ముగించారు. మార్గశిర మాసంలో రాజన్న ఆలయంలో ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు శరత్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

రాజన్న సేవలో  సినీనటి కల్పలత పూజలు

వేములవాడ రాజన్నను తెలుగు సినీ నటి గార్లపాటి కల్పలత దర్శించుకొని పూజలు చేశారు. ఆమె ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ తల్లిగా నటించారు.