సిగరెట్ తాగొద్దన్నందుకు టెన్త్ స్టూడెంట్ సూసైడ్

  • రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాలలో ఘటన

కోనరావుపేట, వెలుగు:  సిగరెట్ తాగొద్దన్నందుకు టెన్త్ స్టూడెంట్ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అలువాల శ్రీనివాస్, అంజవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా చిన్న కొడుకు వెంకటేశ్(16) స్థానిక ప్రభుత్వ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. కొద్ది రోజులుగా వెంకటేశ్ ​సిగరెట్ తాగుతుండగా తల్లిదండ్రులకు తెలియడంతో వద్దని మందలించారు.

దీంతో అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించగా కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. అప్పటి నుంచి వెంకటేశ్​ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటున్నాడు. గురువారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు.