రూ. 4 లక్షలకు ముగ్గురు కొడుకులను అమ్మేసిన తల్లి

డబ్బుల కోసం తన ముగ్గురు కొడుకులను అమ్మింది ఓ తల్లి. డిసెంబర్ 7న  నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు  ఆర్మూరు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముగ్గురు మైనర్ కుమారులను ( వీరిలో ఇద్దరు కవల పిల్లలు, ) వేర్వేరు వ్యక్తులకు  అమ్మేసిందని..  ముగ్గురి చిన్నారులో ఒకరి వయసు ఏడేళ్లు .. కవలల వయసు ఐదేళ్లు  ఉన్నట్లు చెప్పారు. 

ఆర్మూర్ కు చెందిన  సంగం  భాగ్యలక్ష్మీకి ముగ్గురు కొడుకులు  ఉండగా వారిని బత్తుల గంగాధర్ అనే వ్యక్తికి రూ. లక్షకు , సలవాసు వనజకు రూ. 2 లక్షలకు ,దేశబోయి నర్సయ్య కు రూ.లక్షా 20 వేలకు అమ్మేసింది. అయితే 10 నెలల క్రితమే మహిళ తన కుమారుల్లో ఒకరిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.   మైనర్లను అమ్మిన తల్లితో పాటు  కొనుగోలు చేసిన ముగ్గురిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

ALSO READ | నిన్నూ అలా తగలేస్తే తెలుస్తుందిరా : ప్రేమించలేదని.. ఇంట్లోకి వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు..!

మైనర్లను అక్రమంగా అమ్మకాలు, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  వార్నింగ్ ఇచ్చారు.  ముగ్గురు  చిన్నారులు శిశుసంక్షేమశాఖ అధికారుల సంరక్షణలో ఉన్నారని తెలిపారు.