ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

బోధన్, వెలుగు : బోధన్​ పట్టణంలోని అంబేద్కర్​చౌరస్తాలో తెలంగాణ విద్యార్థి పరిషత్​ నాయకులు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్​ డివిజన్​ అధ్యక్షుడు మిసాలే నాగేష్ మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.  ట్రిపుల్​ఐటీలో పదేళ్లలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఏటా ఆత్మహత్య చేసుకుంటున్నా తగిన చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు. ప్రశ్నించే విద్యార్థులపై లాఠీచార్జీ  చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  యూనివర్సీటీలో రాజకీయ నాయకులకు  ప్రవేశం కల్పిస్తూ, విద్యార్థి నాయకులకు ఎందుకు కల్పించడంలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు నిఖిల్, ప్రసాద్, దత్తు తదితరులు పాల్గొన్నారు.