పర్యాటక కేంద్రంగా సూర్యాపేట : పటేల్ రమేశ్ రెడ్డి

  • టీఎస్​టీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటకు రూ.61కోట్లు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ఎస్టిమేషన్ సిద్దం చేసినట్లు తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తెలిపారు. పాలమూరులోని పిల్లలమర్రి, మూసీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. సూర్యాపేటలోని తన నివాసంలో ఆరెగూడెం, దాస్ తండాకు చెందిన వివిధ పార్టీల నేతలు పులగం వెంకట్​రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోను కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట తరహాలో సూర్యాపేటను అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నానని వివరించారు. పట్టణంలో మూడు సెల్ఫీ పాయింట్ల ఏర్పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.