హాస్పిటళ్లలో టీజీఎంసీ తనిఖీలు

గోదావరిఖని, వెలుగు :  గోదావరిఖనిలో హాస్పిటళ్లపై తెలంగాణ స్టేట్​ మెడికల్​ కౌన్సిల్(టీజీఎంసీ)​ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేశారు. ఐబీ కాలనీలో శ్రీనివాస హాస్పిటల్​, శివ హర్షమొలల దవాఖానాలో తనిఖీలు చేసి అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్నారని స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్​ మెంబర్​ డాక్టర్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైద్య బృందం తేల్చింది. ఈ తనిఖీల్లో ఐబీ కాలనీలోని శ్రీనివాస క్లినిక్​ పేరుతో టి.శ్రీనివాస్​ అర్హత లేకపోయినా అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.

పేషెంట్లకు విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్​, స్టెరాయిడ్స్​ ఇస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. అలాగే శివ అనే వ్యక్తి అర్హత లేకపోయినా అర్షమొలల దవాఖానా పేరిట వైద్యం చేస్తున్నట్టు గుర్తించారు. కాగా తనిఖీల సమాచారం తెలుసుకున్న నకిలీ డాక్టర్లు పరారయ్యారు. నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేసినట్టు  డాక్టర్​ రాజ్​కుమార్​ తెలిపారు.