యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్లశ్రీధర్ బాబు

  • ​​​​​​ఐటీ, పరిశ్రమల  శాఖ  మంత్రి దుద్దిళ్లశ్రీధర్ బాబు

మంథని, వెలుగు: యువతకు ఉపాధి కల్పించడమే  ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం ఆయన మంథని పట్టణంలోని గిట్లాస్ హబ్ వద్ద సెంటిలియన్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు.  అనంతరం మంత్రి  శ్రీధర్ బాబు మాట్లాడుతూ..  మంథని మారుమూల ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

 రానున్న రోజుల్లో మంథని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు, కంపెనీలు రానున్నాయని వాటితో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు.  నిరుద్యోగుల బాధలు తొలగిపోతాయన్నారు. మరి కొన్ని రోజుల్లో స్కిల్ యూనివర్సిటీని మన ప్రాంతంలో స్థాపించి విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి  ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.