JEE Rank: జేఈఈ ర్యాంక్ సాధించిన విద్యార్థికి అండగా రాష్ట్రప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల: జేఈఈ అడ్వాన్స్డ్ సీటు సాధించినప్పటికీ ఫీజు చెల్లించలేని విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థి ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను రావడంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం అందించాలని సీఎంఓకు ఆదేశాలు జారీ చేశారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్లపల్లి మండలం గొనే నాయక్ తండాకు చెందిన బదావత్ కుమార్తె మధులత జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరిలో 824 ర్యాంక్ సాధించింది. ఆమె పాట్నాలో చదువుకునేందుకు అవకాశం వచ్చింది. అయితే రూ. 3లక్షల ఫీజు కావాల్సి ఉండగా.. అంత చెల్లించలేని స్థితిలో ఉన్న మధులత కుటుంబం ఆర్థిక పరిస్థితిపై  సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో స్పందించి ఆదేశించడంతో సీఎంఓ కార్యాలయంల మధులతకు ఆర్థిక సహాయం అందించారు. 

2లక్షల51వేల 831 ఆర్థిక సాయం అందించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ట్యూషన్ ఫీజును మాఫీ చేసింది , అకడమిక్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, జింఖానా, రవాణా, మెస్ ఫీజులు, ల్యాప్‌టాప్ , ఇతర ఛార్జీల కోసం రూ.1లక్షా 51వేల 831 విడుదల చేసింది. మధులత విద్యాపరంగా రాణిస్తూ తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.