ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ

  • డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో ఏర్పాటు
  • మంత్రులు పొన్నం, శ్రీధర్​బాబు,సలహాదారు కేశవరావు సభ్యులుగా జీవో

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌‌ గా.. మంత్రులు డి.శ్రీధర్‌‌ బాబు, పొన్నం ప్రభాకర్‌‌, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు సభ్యులుగా ఉన్నారు. జీఏడీ (సర్వీసెస్‌‌) ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ కమిటీకి మెంబర్‌‌ కన్వీనర్‌‌ గా వ్యవహరిస్తారు. అన్ని శాఖల స్పెషల్‌‌ సీఎస్‌‌ లు/ప్రిన్సిపల్‌‌ సెక్రటరీలు ఈ సబ్‌‌ కమిటీ నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలతో సీఎం రేవంత్‌‌ రెడ్డి సమావేశమయ్యారు. ఆయా సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలు, వారు దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ ఏర్పాటు చేస్తామని అదే రోజు హామీ ఇచ్చారు. అందులో భాగంగా శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.