పదేండ్ల సంబురం

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లు, ఎస్పీ, మున్సిపల్, మండల ఆఫీసులు, గ్రామపంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. కరీంనగర్‌‌‌‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు జెండాలు ఎగురవేశారు. పోలీస్ హెడ్​క్వార్టర్స్‌‌లో సీపీలు, ఎస్పీలు జెండా ఎగురేశారు.

జగిత్యాల కలెక్టరేట్‌‌లో జరిగిన వేడుకులకు విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ హాజరయ్యారు. చొప్పదండి, కోరుట్ల, వేములవాడ, మంథని, కోరుట్ల, జమ్మికుంట, సుల్తానాబాద్‌‌, మున్సిపాలిటీలతోపాటు చందుర్తి, మల్యాల, బోయినిపల్లి, ఇల్లందకుంట మండలకేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఎగురేశారు. పలుచోట్ల తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఫొటోలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.