బాలికల హాస్టల్ ​తనిఖీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్​ బాలికల హాస్టల్​ను శనివారం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్​ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్​ పొదెం వీరయ్య తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్​ రూమ్స్, వంటగది, వాష్​ రూం, డ్రైనేజీలను పరిశీలించారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు అందించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. త్వరలో భద్రాచలానికి యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ మోడల్​ స్కూల్​ మంజూరు అవుతుందని ఆయన వెల్లడించారు.