నేడు కేబినెట్​ భేటీ

  •     హైడ్రాకు ఆర్డినెన్స్..శాఖల నుంచి అధికారుల డిప్యుటేషన్!
  •     హెల్త్ ప్రొఫైల్, రేషన్ కార్డుల పంపిణీ విధివిధానాలపై చర్చ
  •     వర్సిటీలకు చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప్​రెడ్డి పేరు
  •     ఎస్ఎల్ బీసీ అంచనాల పెంపునకూ ఆమోదం!

హైదరాబాద్, వెలుగు : హైడ్రాకు చట్టబద్ధత కల్పించేదానిపై అర్డినెన్స్ ఇవ్వాలా? లేక అధికారాల బదలా యింపు చేయాడమా? లేదా రెండింటిని అమలు చేయాలా? అనేదానిపై శుక్రవారం జరగనున్న రాష్ట్ర కేబినేట్​భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్​ అధ్యక్షతన సెక్రటేరియేట్​లో సాయం త్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హైడ్రా నోటీసులు, కూల్చివేతలు, అధికారలతో పాటు చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. 

అయితే, హైడ్రాకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్​ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి న్యాయ శాఖ నివేదించిం ది. ఇరిగేషన్​, రెవెన్యూ, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్, పంచాయతీరాజ్ శాఖ, జీహె చ్ఎంసీలకు సంబంధించి ఆయా డిపార్ట్​మెంట్లలో చెరువులు, కుంటల పరిరక్షణకు, ప్రభుత్వ భూముల రక్షణకు అమలవుతున్న చట్టాలను సవరించాలని సూచన వచ్చింది. ఆయా చట్టాలలో ప్రత్యేకంగా ఒక అధికారికి బాధ్యత అప్పగించేలా సవరణ చేసి.. వారిని హైడ్రాకు డిప్యూటేషన్ చేయనున్నట్లు తెలిసింది. 

ఇలా అధికారాలను పూర్తిగా హైడ్రాలో డిప్యూటేషన్​లో పనిచేస్తున్న ఆయా శాఖల అధికారులకు ఇవ్వనున్నారు. దీంతో నోటీసులు జారీ, కూల్చివేతలు పర్యవేక్షణ వంటివి కంప్లీట్ చేసేలా న్యాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. అయితే చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు భారీ పెనాల్టీలు వేయడంతో పాటు  జైలు శిక్షలు వంటివి కూడా అమలు చేయాలనుకుంటున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ఇవ్వాలనే ప్రతిపా దన కూడా ప్రభుత్వానికి వచ్చింది. అధికారాల బదలాయింపు చేయడంతో పాటు ఆర్డినెన్స్ కూడా ఇస్తారని సెక్రటేరియేట్ వర్గాలు వెల్లడించాయి. 

రైతు భరోసాపై చర్చ

తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసు కోనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై చర్చించనున్నారు. ఇందుకోసం ఒక కమిటీ వేయాలని అనుకుంటున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రేషన్​ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ విధివిధానాలపై చర్చించనున్నారు. రూ.2 లక్షల రుణాల మాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని.. మాఫీ చేసిన మొత్తంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దెబ్బతీశాయి. ఆ వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి, సహాయం కోరుతూ కేబినేట్ తీర్మానం చేయనున్నారు. కొత్తగా మరో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్​లో ఆమోదం తీసుకోనున్నారు. పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు ఇచ్చే దానిపై రైతుభరోసాకు సంబంధించి కేబినేట్​లో చర్చించే అవకాశం ఉన్నది. ఎస్ఎల్​బీసీ అంచనాలు దాదాపు రూ.4300ల కోట్లకు పెంచడంపై కూడా మంత్రివర్గ ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది. 

స్థానికతపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జీవో నం.33పైనా కూడా కేబినెట్​లో చర్చించే అవకాశం ఉన్నది. ఇటీవల బీసీ కులగణనపై హైకోర్టు తీర్పు ఇవ్వడం.. కొత్త బీసీ కమిషన్ కొలువు తీరడంతో రిజర్వేషన్ల ఖరారుకు కులగణనపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఫోర్త్ సిటీకి సంబంధించి కూడా కేబినేట్​లో చర్చించనున్నారు.