Telangana Special : పాలకుర్తితో ఆకుకూర జొన్నరొట్టె పండుగ.. 2 నెలలు ఇదే తింటారు..!

 రజాన్ బాజి.. జవార్ బాటీ (పచ్చకూర, జొన్నరొట్టె) లంబాడాలకు ఎంతో ఇష్టమైన ఫుడ్, పచ్చకూర ఒక్కటే కాదు ఈ టైంలో అడవి, బీడు భూముల్లో, పంటచేలలో ఒడ్ల పక్కన అనేక రకాల ఆకు కూరమొక్కలు లుస్తాయి. అవన్నీ ఎంతో ఇష్టంగా తింటారు లంబాడాలు. ఈ రెండు నెలలు పచ్చకూర పండుగ చేసుకుంటారు. పచ్చకూరతో జొన్నరొట్టె వేరంటున్నారు వాళ్లంతా.

 ఒకప్పుడు లంబాదాల్లో ఎక్కువమంది. ఉండే దగ్గరలో గుడి సెలు వేసుకుని అక్కడే పశువులు మేపుతూ, వ్యవసాయం చేస్తూ బతికేవాళ్లు. తర్వాత కొన్నాళ్లకు మళ్లీ ఇంకో ప్రాంతానికి వెళ్లేవాళ్లు. కానీ.. ఇప్పుడు చాలామంది స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లది ప్రత్యేకమైన జీవనశైలి. వాళ్లకట్టుబాట్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాళ్లు చేసుకునే పండుగలన్నీ ప్రకృతిని ఆరాధించేవే. వాళ్ల ఆహార అలవాట్లు కూడా కాస్త విభిన్నంగా ఉంటాయి. 

ఆకు కూరలు ఎక్కువగా తింటారు. పొలాల్లో పండించే తోటకూర, పాలకూర కంటే అడవి, బీడు భూముల్లో మొలిచే ఆకు కూరలను (కోడిజుట్టు కూర), మాటీర్ బాజీ (తోటకూర), అక్కడక్కడ మొలుస్తుంది. ఈ పచ్చకూర ఎక్కువగా తింటారు. లంబాబాలు పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు లాంగ్జీల్బాజీ (గునుగు ఆకు), కరును బాజీ (చెంచల్ కూర), కెశిల్ బాజీ (బంక కూర), చగలాల్ బాజీకెసిరజాన్ బాజీ (పచ్చకూర)లను ఏరుకొచ్చి వండుకుంటారు. ఈ కూరలతోపాటు జొన్నరొట్టెలు చేసుకుని తింటారు.

 ఇవి సీజనల్ కూరలు

సాధారణ ఆకు కూరలు ఎప్పుడైనా పండించవచ్చు. ప్రకృతి తనంతట తానుగా ప్రసాదించేది పచ్చకూర, పచ్చకూర పేరుతో మార్కెట్ లో అనేక రకాల ఆకు కూరలు దొరుకుతున్నాయి. ఈ పచ్చకూర మాత్రం వానాకాలంలో మాత్రమే దొరుకుతుంది. మొదటి వర్ణానికే ఈ మొలకలు వస్తాయి. జూన్లో మొదలు పెడితే జూలైలో వరి నాట్లు వేసేవరకు రెండు నెలలు ఎక్కువగా దొరుకుతుంది. ఆ తర్వాత పంట పొలాల్లో రుచితోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తోంది. అంటున్నారు లంబాణాలు. అందుకే ఈ రెండు నెలల్లో శీక్షా పండుగ రోజు తప్ప మిగతా రోజుల్లో చికెన్, మటన్ కూడా తినరు. ప్రతి రోజూ ఆకు కూరలే తింటారు. అదికూడా జొన్న రొట్టెతోనే తింటారు. అన్నంతో తినేందుకు ఇష్టపడరు. 

పోషకాలు పుష్కలం

పచ్చకూర, జొన్నరొట్టె రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. డాక్టర్లు. పచ్చకూరలో బీ-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. పచ్చకూర తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. చర్మ వ్యాధుల నుంచి కాపాడుతుంది. రక్త హీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. జొన్నరొట్టె తేలిగ్గా జీర్ణమవుతుంది. కడుపులో అల్సర్ వంటి లక్షణాలను నివారిస్తుంది. చాలా తక్కువ టైంలో శక్తినిస్తుంది. బాలింతలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు.