రైతు రుణ మాఫీ: దేశానికే తెలంగాణ రోల్ మోడల్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రైతు రుణ మాఫీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ నిధులును రైతు రుణాలకే వాడాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా  చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం టేకుమట్ల రైతు వేదిక లో రుణమాఫీ వేడుకల్లో  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని రైతులతో  ఎంపీ వంశీకృష్ణ వీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం నిజామాబాద్ లో రైతులకి రుణమాఫీ సంబరాల్లో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ట్రాక్టర్ నడుపుతూ రైతు వేదికవద్దకు చేరుకున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం  ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసిందన్నారు.  దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్ కాబోతుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని   బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు.  కష్టకాలంలో ఉండి కూడా సీఎం రేవంత్   రైతు రుణమాఫీ చేయడానికి   పైసా పైసా కూడబెట్టుతూ దుబారా ఖర్చులు తగ్గిస్తూ రైతులకు రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు. హుజురాబాద్ లో  నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు తోపాటు కార్యకర్తలు, రైతులు బైక్ ర్యాలీ చేసి రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా   బోథ్  మండల కేంద్రం లో రైతుల రుణమాఫీ సంబరాలు  జరిగాయి.  నేరడిగొండ రైతు వేదికలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు పాల్గొన్నారు. రుణమాఫీ కావడంతో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు,  కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులు  పాలాభిషేకం చేశారు. కొమురం భీం జిల్లా   చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడా గ్రామంలోని  రైతు వేదికలో రైతు రుణ మాఫీ సంబరాల్లో  సిర్పుర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు,రైతులు అదికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా  జుక్కల్ నియోజిక వర్గం లింబుర్ గ్రామములో రైతు వేదికలో  జరిగిన రైతు రుణ మాఫీ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. కొమురం భీం జిల్లా   బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు రుణ మాఫీ సంబరాల్లో   ఎమ్మెల్సీ దండే విఠల్,రైతులు పాల్గొన్నారు.