రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి 

నల్గొండ అర్బన్, వెలుగు : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పారేపల్లి నాగరాజు, వైద్యుల సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.  ఈ మేరకు సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, క్వింటాల్ కు రూ.300 కమీషన్ పెంచాలన్నారు.

ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్లలో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే మిషన్ ఏర్పాటు చేయాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను ఇవ్వాలని కోరారు. దిగుబడి హమాలీని ప్రభుత్వమే భరించాలని, ఒక శాతం తరుగు, ప్రతినెలా ఈ–పాస్ నుంచి తొలిగించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విజయకుమార్, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.