ఉమ్మడి జిల్లాలో మొదటి విడత .. రుణమాఫీకి అంతా రెడీ 

  • రూ.లక్షలోపు లోన్లు ఉన్న 1.29 లక్షల మంది రైతులకు లబ్ధి 
  • ఇప్పటికే లిస్ట్​ రెడీ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆఫీసర్లు
  •  నేడు మధ్యాహ్నం 4 గంటలకు బ్యాంకుల్లో జమ 
  • రైతు వేదికల్లో సంబురాలు బైక్ ర్యాలీలు

కరీంనగర్, వెలుగు: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీకి వేళయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన  హామీని నెరవేర్చడంలో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం 4  గంటలకు మాఫీ చేయబోతుంది. మొదటి విడతలో లబ్ధిపొందే రైతులు ఉమ్మడి జిల్లాలో 1,29,730 మంది ఉండగా, అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 39,354 మంది లబ్ధిదారులు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 36,872 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23,779 మంది, పెద్దపల్లి జిల్లాలో 29,725 మంది రైతులు ఉన్నారు. వీళ్లందరికీ రూ.లక్ష వరకు క్రాప్ లోన్ మాఫీ కానుంది. బుధవారం సాయంత్రం లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. 

రైతు వేదికల్లో సంబురాలకు ఏర్పాట్లు.. 

ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా ఒకేసారి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రైతులను రుణవిముక్తులను చేసే ఈ చారిత్రక నిర్ణయానికి కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా సహకరించింది. పదేళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. దివంగత వైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రుణమాఫీ కాబోతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రుణం మాఫీ అయినరైతులతో రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామగ్రామాన బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.   

రైతు రుణమాఫీ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జీపీల్లో ప్రదర్శించాలి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రుణమాఫీ రైతుల జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలని కలెక్టర్ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధశారం కలెక్టరేట్ లో రుణమాఫీ అమలుపై  వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతు వేదికల్లో రుణమాఫీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో డీఏవో భాస్కర్, ఏవోలు పాల్గొన్నారు.