నవంబర్ 8న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఈ నెల 8న (శుక్రవారం) రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి నరసింహా స్వామిని దర్శించుకోనున్నారు. ఈమేరకు ఆదివారం (నవంబర్ 3) ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని అధికారులను ఆదేశించారు. 

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. 2023 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈమేరుకు యాద్రాతి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా ఆయన 2024 మార్చి 11 యాదగిరిగుట్టకు వెళ్లారు.