కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర

కరీంనగర్/సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్ సిటీలోని అమరవీరుల స్థూపం నుంచి వేములవాడకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం విజయ సంకల్ప మహా పాదయాత్ర నిర్వహించారు. ‌‌‌‌ఫోరం రాష్ట్ర కన్వీనర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్‌‌‌‌ మాట్లాడుతూ పాదయాత్ర వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాక మొక్కులు సమర్పిస్తామని తెలిపారు. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌‌‌లో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు.