సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా తేజస్ నంద్ లాల్ పవార్ ను నియమిస్తూ  సీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ శాంతాకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.వెంకట్ రావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న

తేజస్ నంద్ లాల్ పవార్ బదిలీపై వచ్చారు. గతేడాది జనవరి 30న సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.వెంకట్​రావు 17 నెలలపాటు ఇక్కడ విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.