ప్రస్తుతానికి దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా ఎలక్షన్స్ గురించే న్యూస్. ఈ మధ్య ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకం పెరిగింది. కొందరు దాన్ని అవసరమైన విధంగా వాడుతుంటే మరికొందరు డీప్ ఫేక్ వంటి పిచ్చి పనులకు వాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ కావడంతో ఏఐ రిలేటెడ్ ఫేక్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది.
ఏఐ రిలేటెడ్ ఫేక్ కంటెంట్ పెరిగితే దాని ప్రభావం ఎన్నికల మీద పడే ఛాన్స్ లేకపోలేదు. అందుకని ‘మెటా ఎలక్షన్స్ ఆపరేషన్స్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు. దానిద్వారా మెటా రిలేటెడ్ యాప్స్ అయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో పనిచేసే ఎక్స్పర్ట్స్ ఏఐ డిజైన్ చేసిన ఫేక్ కంటెంట్‌కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారట. తప్పుడు సమాచారాన్ని లిమిట్ చేసి ఓటింగ్ మీద దాని ప్రభావం పడకుండా చూస్తారట. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్లాట్‌ఫామ్స్ ట్రాన్స్పరెంట్గా ఉండేలా ప్రయత్నిస్తోంది మెటా. ఏఐని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడమే కాకుండా మెటా థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్స్ నెట్‌వర్క్‌ను భారత్‌లో విస్తరించనున్నారు.
ఇప్పటికే మెటా కంపెనీకి దేశవ్యాప్తంగా15 భాషలను అందించే11 ఫ్యాక్ట్ చెకర్స్ పార్ట్నర్స్ ఉన్నారు. 20 భారతీయ భాషలతో సహా 70 కంటే ఎక్కువ భాషల్లో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్‌లో కంటెంట్ రివ్యూ చేసే15 వేల మంది కంటెంట్ రివ్యూవర్లు ఉన్నారు. 2019 నుంచి ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేస్తోంది మెటా. రాబోయే ఎన్నికల కోసం ఓటింగ్ ప్రక్రియలపై అధికారిక సమాచారాన్ని అందించడానికి ఈసీఐతో గూగుల్ సెర్చ్, యూట్యూబ్ వీడియో ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్, శక్తి (పాన్ ఇండియా నెట్వర్క్) రెండూ డీప్ ఫేక్తోపాటు అనేక ఆన్లైన్ ఫేక్ కంటెంట్ గుర్తించడంలో సాయపడతాయి.