గూగుల్ పే, ఫోన్ పేనే కాదు జియో పే కూడా వచ్చింది..!

ఇప్పుడు ఆన్​లైన్ పేమెంట్​ సిటీల్లోనే కాదు గ్రామాల్లోనూ వాడుతున్నారు. ఇప్పటికే పేటీఎం, ఫోన్​ పే, గూగుల్ పే వంటివి ఉన్నాయి. అయితే, తాజాగా జియో పే కూడా అందుబాటులోకి వచ్చింది. జియో కంపెనీ ఎప్పటికప్పుడు అప్​డేట్ అవుతూ సరికొత్త ఆలోచనలతో యూజర్లను ఆశ్చర్యపరుస్తుంటుంది. లేటెస్ట్​గా జియో పేమెంట్స్ యాప్​ తీసుకొచ్చి మరోసారి సర్​ప్రైజ్ చేసింది.

ఆన్​లైన్ పేమెంట్ అగ్రిగేటర్​గా ఆర్బీఐ నుంచి ఆమోదం పొందింది. దీంతో వ్యాపారులు, కస్టమర్లు ఈజీగా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆన్​లైన్ పేమెంట్ అగ్రిగేటర్​గా, జియో పేమెంట్స్ డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, ఇ– వ్యాలెట్స్​ మరికొన్నింటితో సహా వెరైటీ  పేమెంట్‌ మెథడ్స్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీని బిజినెస్​లకు అందిస్తాయి.