యాపిల్ కంపెనీ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే ఐ ట్రాకింగ్ ఫీచర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ కళ్లతోనే ఐప్యాడ్, ఐఫోన్లను కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫీచర్ స్పెషల్లీ ఛాలెంజెడ్ యూజర్ల కోసం డిజైన్ చేశారు. ఐ ట్రాకింగ్‌ను సెటప్ చేయడానికి ముందువైపు కెమెరా ఉపయోగపడతుంది. దీన్ని వాడిన డాటా మొత్తం మీ డివైజ్‌లో ఉంటుంది.
యాపిల్‌తో కూడా డాటా కంట్రిబ్యూట్ చేయదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ సేఫ్. ఐ ప్యాడ్ ఒఎస్, ఐఒఎస్లోని అన్ని యాప్‌లతో ఐ ట్రాకింగ్ పనిచేస్తుంది. కాబట్టి అడిషనల్ హార్డ్‌వేర్ లేదా యాక్సెసరీలు అవసరం లేదు. ఐ ట్రాకింగ్ సాయంతో యాప్‌లోని వివిధ భాగాలను చూడటం ద్వారా నావిగేట్ చేయొచ్చు. ఈ ఎలిమెంట్స్ యాక్టివేట్ చేయడానికి డ్వెల్ కంట్రోల్ వాడాలి. ఐ ట్రాకింగ్ యూజర్లు ఫిజికల్ టచ్ అవసరం లేకుండా కేవలం కళ్లను వాడి బటన్స్ ప్రెస్, స్వైపింగ్ వంటివి చేయొచ్చు.