యూట్యూబ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. అయితే, ఈసారి వచ్చిన ఈ ఫీచర్ వ్యూయర్స్ కోసం కాదు. కంటెంట్ క్రియేటర్ల కోసం. వాళ్లు అప్లోడ్ చేసిన వీడియోలకు కింద వచ్చే కామెంట్స్ కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి.
అలాంటి కామెంట్స్‌కి చెక్‌పెట్టేందుకు ఈ ఫీచర్ వాడొచ్చు.
మామూలుగా యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేసే క్రియేటర్స్‌కి కామెంట్స్ వస్తుంటాయి. నిజానికి దాన్ని వాళ్లు ఫీడ్బ్యాక్లా తీసుకుంటారు. అందులో కామెంట్లను పూర్తిగా ఆపేయడం, రెండోది పబ్లిష్ చేయడం ఈ రెండు ఆప్షన్లే ఉండేవి. అయితే, పబ్లిష్ చేశాక పాజిటివ్‌గానే కాకుండా నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. వాటి వల్ల క్రియేటర్స్ ఇబ్బంది పడుతుంటారు.
దాంతో కామెంట్స్‌ని ఆపలేక బాధపడతారు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఆ వీడియోనే డిలీట్ చేసేస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? క్రియేటర్స్ వీటిని ఎలా అడ్డుకోవాలి? అనే ప్రశ్న ఎదురయ్యేది. ఆ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టడానికే యూట్యూబ్ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో కామెంట్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఒకసారి వీడియో అప్లోడ్ చేశాక, కామెంట్స్ వస్తాయి. అయితే, ‘కొత్త కామెంట్స్ వద్దు’ అనుకున్నప్పుడు ‘పాజ్’ ఆప్షన్ ఆన్ చేయాలి.
ఒరిజినల్ క్వాలిటీ
ఆండ్రాయిడ్, ఐఫోన్, వాట్సాప్ వెబ్‌తో కూడిన మల్టీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో ఎలాంటి మార్పులు అవసరం లేకుండా ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వెర్షన్ 23.24.73తో ఈ ఫీచర్ ఐఫోన్ కస్టమర్స్ అందరికీ అందుబాటులోకి వస్తోంది. యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్ను ఐఓఎస్ యూజర్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో వాట్సాప్‌లో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలు డాక్యుమెంట్లుగా పంపడానికి హెల్ప్ అవుతుంది. కంప్రెస్ చేయడం లేదా క్వాలిటీ లెస్ కాకుండా హెచ్డి ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేయాలంటే..
వాట్సాప్ ఓపెన్ చేసి, చాట్ ఓపెన్ చేయాలి.
అందులో టెక్స్ట్ఇన్ఫుట్ ఫీల్డ్కి ఎడమవైపు కనిపించే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి.
తర్వాత డాక్యుమెంట్స్లోకి వెళ్లి పంపాలనుకున్న ఫొటో లేదా వీడియోను సెలక్ట్ చేసుకోవాలి.
బ్లూ కలర్ బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే ఆ ఫొటో లేదా వీడియో హెచ్డి క్వాలిటీతో సెండ్ అవుతుంది.
అయితే ఫైల్ సైజ్ 2జీ మాత్రమే ఉండాలి. 2జీబీ ఉంటే పంపడం వీలుకాదు.
ఇలా పంపే ఫొటోలు, వీడియోలకు ప్రివ్యూలు కనిపించవు.
రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిపై ట్యాప్ చేస్తే చూడొచ్చు. అవసరమైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఈ ఫీచర్ కొన్ని రోజుల కిందటే వచ్చింది. ఇప్పుడు ఐఫోన్లో అందుబాటులోకి వచ్చింది.
లాక్డ్ చాట్స్‌కు సీక్రెట్ కోడ్
చాట్స్ కోసం వాట్సాప్ కొత్తగా సీక్రెట్ కోడ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటికే వాట్సాప్‌లో పర్సనల్ చాట్స్‌ను లాక్ చేసుకునే వీలు కల్పించింది. కానీ, అందులో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. దాంతో ఈ ఫీచర్ తెచ్చింది. దీనివల్ల యూజర్ల ప్రైవసీ అప్‌గ్రేడ్ చేసింది. సీక్రెట్ కోడ్ ఫీచర్‌తో యూజర్లు తమ చాట్స్‌కు ఆంగ్ల అక్షరాలు, ఎమోజీలతో ప్రత్యేక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సెర్చ్బార్లో సీక్రెట్ కోడ్ టైప్ చేసినప్పుడే లాక్డ్ చాట్స్ కనిపించేలా యూజర్ సెట్ చేయొచ్చు.
వాట్సాప్‌ని అప్డేట్ చేయాలి
లాక్డ్చాట్కి వెళ్లి పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
అందులో ‘హైడ్ లాక్డ్ చాట్స్’ ఫీచర్ యాక్టివేట్ చేయాలి.
లాక్ చేయాల్సిన చాట్లకు మళ్లీ యాక్సెస్ చేసుకోవడానికి సీక్రెట్ కోడ్‌ని ఎంటర్ చేయాలి.
లాక్ చేసిన చాట్లు ప్రైమరీ చాట్ విండోలో కనిపించవు.
హైడ్ చేసిన లాక్డ్ చాట్లను ఓపెన్ చేయడానికి సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి చూడాలి.