Tech layoffs:ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్..మేం ఉద్యోగులను తొలగించడం లేదు

ఐటీ కంపెనీల్లో టెక్ ఉద్యోగులను లేఆఫ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లేఆఫ్స్ పై టెకీలు ఆందోళన చెందుతున్న క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ నుంచి ఉద్యోగులను తగ్గించే యోచన లేదని ప్రకటించింది. తమ వర్క్ ఫోర్స్ తథాతధంగా కొనసాగుతుందనని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఫరేఖ్ చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. టెక్ పరిశ్రమలో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతున్న క్రమంలో కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పా రు. ఉద్యోగాలను తగ్గించే ఆలోచన లేదని చెప్పారు. GenAI తో సహా వివిధ రకాల టెక్నాలజీలను ఏకం చేసేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. టెక్నాలజీ డెవలప్ మెంట్ ఉద్యోగాలను తొలగించే బదులుగా మరిన్ని అవకాశాలను ఇస్తుందని పరేఖ్ అన్నారు. 

వాస్తవానికి టెక్ ఇండస్ట్రీలో కంపెనీలు అనుసరిస్తున్న విధానాన్ని మేం అనుసరించం.. అన్నిరకాల టెక్నాలజీలను కలుపుతూ కంపెనీనీ ముందు తీసుకెళ్తామన్నారు పరేఖ్. రానున్న రోజుల్లో ఉత్పాదక AI లో నిపుణులతో ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలందించబోతున్నామన్నారు. 


అంతకుముందు,భారత దేశం మంచి పురోగతి సాధించింది.. భారత దేశం ప్రపంచ ఆవిష్కరణలకు అనుగుణంగా ఉందని ఇన్ఫోసిస్ వ్వవస్థాపకుడు నారాయణ మూ ర్తి ప్రశంసించారు.