హూగ్లీ బ్రిడ్జ్‌పై ఉద్రిక్తత లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య కేసులో విద్యార్థులు చేస్తున్న ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మమతా బెనర్జీ రాజీనామా, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్లతో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. నబన్న అభిజన్  ర్యాలీ హూగ్లీ బ్రిడ్జ్ పైకి రాగానే విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు విసిరారు.. త్రివర్ణ పతాకాలు పట్టుకొని పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లని ద్వంసం చేశారు. అక్కడున్న భద్రతా బలగాలు నిరసన కారులను కంట్రోల్ చేయడానికి లాఠీఛార్జ్ చేసి, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. 

పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర సచివాలయం పైపుగా విద్యార్థి సంఘాలు మఖ్యమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. వారిని పోలీసు బలగాలు అడ్డుకుంటున్నాయి.  ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడుకి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధులు.