ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్ట్‌లో భారత ఓటమి ఖరారైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చేతులేత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా 175 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తెలంగాణ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ 24, శుభమన్ గిల్ 28, రిషబ్ పంత్ 28 రన్స్ చేశారు.
కెప్టెన్ రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 11, కేఎల్ 7 పరుగులు మాత్రమే చేసి మరోసారి తీవ్రంగా నిరాశ పర్చారు. మూడో రోజు ఆట ప్రారంభించిన పంత్, నితీష్ వెంట వెంటనే ఔట్ కావడంతో ఫస్ట్ సెషన్లోనే టీమిండియా చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. స్కాట్ బోలాండ్ 3, స్పీడస్టర్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది.