ఎస్​జీటీలకు పీఎస్​ హెచ్​ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలి

వేములవాడ, వెలుగు : ఉపాద్యాయ పదోన్నతుల్లో  ఎస్​జీటీలకు అన్యాయం జరిగిందని  వేములవాడ ఎంఈవో బన్నాజీకి  ఉపాధ్యాయులు బుధవారం వినతి పత్రం అందజేశారు.  బీఈడీ  టీచర్లు  దాదాపు 20- సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్నారన్నారు.   ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం వల్ల  సీనియర్ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.  

12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్​జీటీలను ఎస్​ఏ లుగా ప్రమోట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, చక్రపాణి, కృష్ణహరి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రాంగోపాల్, నరేష్, రాజేశం  తదితరులు పాల్గొన్నారు.