Teachers day wishes 2024: మీ టీచర్లకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి..

 

ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర. జీవితంలో మొదటి గురువు తల్లి. అక్కడినుంచి పాఠశాలలో మీకు విద్య నేర్పిన ప్రతి గురువు మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారకులు. మనకు జ్ఞానాన్ని బోధించి, ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువు. మీ జీవితంలోని ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలపండి .

 భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఈ అందమైన సందేశాలను మీ ఉపాధ్యాయులకు, మీ జీవితంలో మీ ఎదుగుదలకు దారి చూపించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పేయండి. . 

గురువు లేకపోతే జీవితం లేదు, గురువు ఆశీర్వాదంతోనే ....
జీవితానికి సన్మార్గం దొరుకుతుంది....
విజయవంతమైన జీవితానికి గురువే పునాది....
హ్యాపీ టీచర్స్ డే

 గురువు లేకుండా జ్ఞానం లేదు....జ్ఞానం లేని ఆత్మ లేదు..
జ్ఞానం, సహనం, ధైర్యం...అన్నీ గురువు నేర్పించినవే.
హ్యాపీ టీచర్స్ డే

సరైన మార్గదర్శకుడు ఉంటే....
చిన్న దీపం కూడా సూర్యుడిలాగా ప్రకాశించగలదు
నా జీవితాన్ని దిద్దిన గురువు మీరే...
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

పూలదండ తయారు చేయడానికి ఎన్నో పూలు కావాలి
అందమైన ముగ్గు వేయడానికి ఎన్నో రంగులు కావాలి
కానీ పిల్లల జీవితాన్ని స్వర్గంగా మార్చడానికి..
అసలైన ఉపాధ్యాయుడు ఒక్కరు చాలు...
హ్యాపీ టీచర్స్ డే

జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగు చూపేది గురువు
దారులన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త మార్గం చూపేది గురువు
పుస్తకాలు చదవడమే కాదూ, జీవితాన్ని జీవించడం ఎలాగో నేర్పేది గురువు
హ్యాపీ టీచర్స్ డే

మంచి గురువు పుస్తకం చూపి పాఠాలు చెప్పరు..
హృదయంతో పిల్లలని అర్థం చేసుకుని బోధిస్తారు..
 నా జీవితంలో ఉత్తమ గురువు మీరే...
 హ్యాపీ టీచర్స్ డే సర్

మనం చేసిన తప్పులు మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తాయి..
. కానీ ఆ తప్పులే చేయకుండా ముందు దారి చూపేది ఉత్తమ గురువు..
నా జీవితంలోని ప్రతి గురువుకు ...
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

నీ స్నేహం నన్ను మంచి మనిషిగా మార్చింది
మనుషుల విలువలు నేర్పింది
తప్పులు చేయకూడని మార్గం చూపింది
మంచితనం విలువ తెలిసేలా చేసింది
నా ప్రతి కష్టంలో నాకు మార్గదర్శకుడిగా ఉన్న ...
మీరే నా జీవితంలో ఉత్తమ గురువు.
మీకు హ్యాపీ టీచర్స్ డే. 

ఒక గురువు మార్గదర్శి కంటే ఎక్కువ...
 ఒక గురువు, స్నేహితుడు .. స్ఫూర్తికి మూలం...
 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

మీ మార్గదర్శకత్వం .. నాకు నేర్పిన  వివేకం ..
నా విద్యా ప్రయాణంలో  ఎన్నో వెలుగులు నింపి..
జీవిత లక్ష్యాన్ని సాధించడంలో ..  
నన్ను  ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు..
మీకు హ్యాపీ టీచర్స్​ డే ..

నా జీవితంలో మార్పు తెచ్చిన అధ్యాపకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ..
 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

ప్రపంచానికి, మీరు కేవలం ఉపాధ్యాయులు..
కానీ మీ విద్యార్థులకు, మీరు ఒక హీరో...
ఎల్లప్పుడూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నందుకు ధన్యవాదాలు...
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

మీలాంటి ఉపాధ్యాయులే మా కలల రూపశిల్పులు...
 మా జీవితాలకు మీరు అందించిన విరాళాలు ఎనలేనివి...
మీ ప్రగాఢమైన ప్రభావానికి మేము కృతజ్ఞులం. .
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 

మా జీవితంలో మార్పు తెచ్చిన ఉపాధ్యాయులందరికీ,,,
జ్ఞానం, సహనం మరియు ప్రోత్సాహం మాకు ప్రపంచాన్ని సూచిస్తుంది...
 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

 బోధన పట్ల మీ అంకితభావం...
 మీ విద్యార్థుల పట్ల నిబద్ధత  ప్రశంసనీయం...
 మీ వివేకంతో మాలో  స్ఫూర్తిని నింపి..
జీవితం అనే అక్షర సత్యాలను బోధించిన.. మీకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. 


ఎందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది..
తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ..
ఆనందపడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో..
తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టే గురువులందరికీ..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

"గురు బ్రహ్మ, గురు విష్ణు గురదేవో మహేశ్వరః
గురు సాక్షాత్​ పరబ్రహ్మ.. తస్మా శ్రీ గురవే నమః
 -హ్యాపీ టీచర్స్​ డే సర్​

ఒక శిల్పి ఎంతో ఓర్పుగా రాయిని చెక్కినట్లుగా.. 
మీరు నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
 మీరు చేసిన ఈ హెల్ప్​కి చాలా ధన్యవాదాలు మాస్టారు. -
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు