కాంగ్రెస్​లో చేరిన సిద్ధరాములు

భిక్కనూరు, వెలుగు: తిప్పాపూర్​ వెంకటేశ్వర ఆలయ చైర్మన్​ తాటిపల్లి సిద్ధరాములు ఆదివారం బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

సిద్ధరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ప్రభుత్వ ఆరు గ్యారెంటీలు నచ్చి పార్టీలో చేరానని, ఈ పార్టీతో ప్రజలందరికీ న్యాయం జరగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తిరుపరి భీంరెడ్డి, కిసాన్​ కాంగ్రెస్ ​జిల్లా అధ్యక్షుడు కుంట లింగారెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ధర్మయ్య పాల్గొన్నారు. ​