Tata Avinya: టాటా అవిన్యా ఈవీ కారు.. ఇండియన్ టెస్లానా.. మోడల్ అదిరింది.. మైలేజ్ ఎంత..?

టాటా మోటార్స్.. ప్రస్తుతం మార్కెట్ లో దుమ్మురేపుతోంది. ఎలక్ట్రికల్ కార్లలో ఇప్పుడు హవా నడుస్తుంది. టియాగో, పంచ్, నెక్సాన్ కార్లతో సేల్స్ అదరగొడుతుంది. ఇదే క్రమంలో బిగ్ అప్ డేట్ వచ్చింది టాటా మోటార్స్ నుంచి. ఈవీ మోడల్లో టాప్ ఎండ్ కారును రిలీజ్ చేస్తున్నట్లు రెండేళ్ల క్రితమే ప్రకటించింది టాటా మోటార్స్. ఆ కారు మోడల్ పేరు అవిన్యా.. ఇది ఎలక్ట్రికల్ కారు.. ఇప్పుడు ఈ కారు విశేషాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. అవేంటో చూద్దాం..

  • టాటా ఎలక్ట్రికల్ అవిన్యా కారు మోడల్ అయితే అదిరిపోయింది.
  • టాటా ఈవీ అవిన్యా చూస్తుంటే.. టెస్లా కారు చూసినట్లే ఉందని అందరూ కామెంట్ చేస్తున్నారు.
  • ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చు.
  • మరో విశేషం ఏంటంటే.. 30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. 
  • ఈవీ కార్లలో ఇదే టాప్ మోడల్ కారు అంటున్నారు నెటిజన్లు.
  • మోడల్కు తగ్గట్టే ధర కూడా ఉంది.. స్టార్టింగ్ ధర కనీసం 30 లక్షలు ఉంటుందని.. హై ఎండ్ ధర 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
  • మరి ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది అంటే.. 2025 జూన్ నెలలో అని సమాచారం. అంటే మరో 10 నెలల్లో టాటా ఈవీ అవిన్యా రోడ్డెక్కబోతుంది.
  • ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు ఇవ్వటం ద్వారా.. ప్రస్తుతం దేశంలోని అన్ని ఈవీ కార్ల కంటే ఇది ఎక్కవ మైలేజ్ అంటున్నారు నెటిజన్లు.
  • అవిన్యా అనే సంస్కృత పదానికి 'Innovation' అనే అర్థం వస్తుంది.
  • ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఏఐ టెక్నాలజీతో టాటా ఈవీ అవిన్యా కారును తయారుచేశారు.
  • బటర్ ఫ్లై డోర్స్ ఈ అవిన్యా కారు ప్రత్యేకతల్లో ఒకటి.
  • 3rd జనరేషన్ ఎలక్ట్రిఫికేషన్తో అవిన్యా కారు రూపుదిద్దుకుంది.
  • అవిన్యా కాన్సెప్ట్ కార్లను స్క్రీన్లెస్ విధానంలో తయారుచేశారు.
  • అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ అవిన్యా కారు స్పెషల్ ఫీచర్.
  • మినిమైజ్-మ్యాక్సిమైజ్-ఆప్టిమైజ్.. ఇదే టాటా కంపెనీ అవిన్యా కార్లను తీసుకురావడం వెనకున్న ఫిలాసఫీ.