Tasty Snacks : మంచ్ ద మోమో.. ఇంట్లోనే మోమోస్ ఇలా తయారు చేసుకోండి..

పునుగులు, సమోసాలు, మిర్చి బజ్జీలు, చాట్, పానిపూరీ... ఇవన్నీ ఈవెనింగ్ స్నాక్స్ గా ఫుల్​ పాపులర్. అయితే వీటి స్థానంలో కొత్త కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మోమోస్​ ఈవినింగ్ స్నాక్స్ గా ఫుడ్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిని రుచి చూడాలంటే మాత్రం ఎప్పుడూ హోటల్స్, రెస్టారెంట్స్ కే వెళ్తుంటారు చాలామంది. అలాకాకుండా ఇంట్లోనే మోమోస్​ ను  ఇలా వండుకుని రుచి చూడండి...

వెజ్ మోమోస్ తయారీకి కావలసినవి

  • బీన్స్ తరుగు ... అరకప్పు
  •  క్యాప్సికమ్ తరుగు ... అర కప్పు
  •  క్యారెట్ తరుగు ... అర కప్పు 
  • అల్లం తరుగు ... ఒక టీ స్పూన్
  • వెల్లుల్లి తరుగు...  ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి తరుగు ... ఒక టీ స్పూన్
  •  గోధుమపిండి....ఒక కప్పు
  • మిరియాలపొడి....ఒక టీ స్పూన్
  • ఉప్పు ...తగినంత 
  • వెన్న.. ఒక టేబుల్ స్పూన్
  • నూనె..  రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: గోధుమపిండిలో ఉప్పు, వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఇప్పుడు ఒక పాన్​ లో  నూనె వేడి చేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అందులో తరిగిన క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కూడా వేసి ఇంకాసేపు మగ్గించాలి. చివరిగా ఉప్పు, మిరియాలపొడి కలిపి స్టవ్​ ఆఫ్ చేసి కాసేపు చల్లార్చాలి. కలిపిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీల్లా వత్తాలి. మధ్యలో కూరగాయల మిశ్రమం ఉంచి అంచులు మూసేయాలి. ఆపై వాటిని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉడికించాలి .. అంతే యమ్మీ యమ్మీ వెజ్​ మోమోస్​ రెడీ. . . 

చికెన్ మోమోస్ తయారీకి కావాల్సినవి

  • మైదా ...ఒక కప్పు 
  • ఉప్పు....తగినంత
  •  వెల్లుల్లి తరుగు...  ఒక టీ స్పూన్ 
  • చికెన్ కీమా.... ఒక కప్పు
  • ఎల్లో క్యాప్సికమ్​ .. ఒక టీ స్పూన్ 
  •  రెడ్ క్యాప్సికం...ఒక టీ స్పూన్
  •  ఉల్లిపాయ తరుగు ... ఒక టీ స్పూన్ 
  • రెడ్ చిల్లీ ప్లేక్స్ ...కొద్దిగా 
  • కొత్తమీర తరుగు ... కొద్దిగా
  •  బటర్... కొద్దిగా

తయారీ విధానం: ముందుగా పాన్​ లో  నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత బౌల్ లో  మైదా, ఉప్పు, వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. తర్వాత మరొక బౌల్ లో చికెన్ కీమా, వెల్లుల్లి, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికమ్, ఉల్లిపాయ తరుగు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొ తిమీర, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా కలిసిన పిండిని కట్ చేసి చపాతీల్లా వత్తాలి. చపాతీ మధ్యలో చికెన్ మిశ్రమాన్ని పెట్టి ఆవిరిపై ఉడికించాలి

డ్రైఫ్రూట్ మోమోస్ తయారీకి కావాల్సినవి

  • మైదా-...అరకప్పు
  • గోధుమ పిండి- ...అరకప్పు 
  • ఉప్పు... - తగినంత
  •  బాదం-...పావు కప్పు
  •  కెసిన్ -... పావుకప్పు
  •  అంజీర్- ... పావు కప్పు 
  • జీడిపప్పు-... పావు కప్పు 
  • నెయ్యి- ...ఒక టీ స్పూన్
  •  నూనె- ...ఒక టేబుల్ స్పూన్
  •  పిస్తా- ...పావుకప్పు

తయారీ విధానం:  మిక్సీజార్​ లో   అంజీర్, కిస్మిస్ వేసి పొడిలా పట్టాలి. తర్వాత ఒక బౌల్ లో  గోధుమ పిండి ఉప్పు, కాస్త నూనె, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. మరొక బౌల్​ లో  తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, అంజీర్​ పేస్ట్ వేసి బాగా కలపాలి.  కలిపి ఉంచిన పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలంలా వత్తి మధ్యలో డ్రైఫూటీ మిశ్రమం పెట్టి అంచులు మూసేయాలి. ఆపై వాటిని నూనె రాసిన కుక్కర్లో ఉంచి ఆవిరిలో ఉడకనివ్వాలి..

మష్రూమ్ మోమోస్ తయారీకి కావాలసినవి

  • మమ్రామ్ తరుగు... ఒక కప్పు 
  • క్యాప్సికమ్ తరుగు .... పావు కప్పు
  •  బీన్స్ తరుగు .. పావు కప్పు
  •  క్యారెట్ తరుగు...పావు కప్పు
  •  పచ్చిమిర్చి తరుగు ... ఒక టీ స్పూన్
  •  మైదా...ఒక కప్పు 
  • ఉప్పు ...తగినంత 
  • మిరియాల పొడి  ...అర టీ స్పూన్ 
  • నూనె ...మూడు టేబుల్ స్పూన్లు
  •  సోయాసాస్... పావు టీ స్పూన్ 
  • కొత్తిమీర... కొద్దిగా

తయారీ విధానం:  ఒక బౌల్​ లో  మైదా ఉప్పు, నూనె తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలపాలి. తర్వాత పాన్ లో నూనె పోసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, కీన్స్ వేసి వేగించాలి. అందులో తరిగిన మష్రూమ్ వేగించాక ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్ వేసి ఇంకాసేపు ఉంచాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి.  ఆ తర్వాత ముద్దలా చేసుకున్న పిండిని కొంచెం కొంచెం  తీసుకుని పూరీల్లా వత్తి మధ్యలో మష్రూమ్ మిశ్రమం పెట్టి అంచులు మూసేయాలి. ఆపై వాటిని కుక్కర్​ లో  ఆవిరికి ఉడికించాలి