Taste Atlas: ఉప్మా చెత్త ఫుడ్ అంట..! భారత్‌లో టాప్ 10 బెస్ట్ వంటకాలివే

భారతదేశ వంటకాలకు, రుచులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ విదితమే. పల్లెటూరి గుడిసెలు మొదలు బహుళ వంటకాల రెస్టారెంట్ల వరకు భోజన బల్లలను నింపే మన ఆహార సంప్రదాయం మన సంస్కృతికి సంకేతం. అలాంటి ఎన్నో వంటకాలకు పుట్టినిల్లు అయిన భారతీయ రుచులకు సంబంధించి ప్రఖ్యాత వంటల గైడ్ 'టేస్ట్ అట్లాస్' ఒక నివేదిక విడుదల చేసింది. 

టాప్ 10 అత్యుత్తమ మరియు చెత్త రేటింగ్ ఉన్న భారత వంటకాల జాబితాను 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసింది. ఇందులో మ్యాంగో లస్సీ, బటర్ చికెన్, హైదరాబాదీ బిర్యానీ వంటివి ఉత్తమ, తినదగిన వంటకాల జాబితాలో చోటు దక్కించుకోగా.. ఆలూ బైంగన్ (బంగాళాదుంప, వంకాయ కూర మిశ్రమం), ఉప్మా, జల్జీరా వంటివి చెత్త వంటకాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 

టాప్ 10 అత్యుత్తమ భారతీయ వంటకాలు 

  • 1. మ్యాంగో లస్సీ
  • 2. చాయ్ మసాలా
  • 3. బటర్ గార్లిక్ నాన్
  • 4. అమ్రిత్ సారి కుల్చా
  • 5. బటర్ చికెన్
  • 6. హైదరాబాదీ బిర్యానీ
  • 7. షాహీ పన్నీర్
  • 8. ఛోలే భటురా
  • 9. తందూరి చికెన్ 
  • 10. కూర్మా

టాప్ 10 చెత్త భారతీయ వంటకాలు

  • 1. జల్జీరా
  • 2. గజక్(నువ్వులు లేదా వేరుశెనగను బెల్లంతో చేసిన స్వీట్)
  • 3. తెంగై సాదమ్(కొబ్బరి అన్నం)
  • 4. పాంటా భాట్(చద్దన్నం)
  • 5. ఆలూ బైంగన్ (బంగాళాదుంప, వంకాయ కూర మిశ్రమం)
  • 6. తాండాయ్ కీర్(హోలీ రోజు చేసే ప్రసిద్ధ సాంప్రదాయ భారతీయ పానీయం)
  • 7. అచ్ఛప్పం
  • 8. మిర్చి కా సాలన్(ఒక రకమైన గ్రేవీ)
  • 9. మాల్పువా
  • 10. ఉప్మా

'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన ఈ జాబితాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చద్దన్నం, కొబ్బరి అన్నం వంటివి ఆరోగ్యానికి మంచిదని.. వీటి విలువ పాశ్చాత్య మానవులకు తెలియదని నెటిజన్లు రేటింగ్ ఇచ్చిన వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు.