హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు

హైదరాబాద్‌లోని పలు హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని జీవీకే వన్ మాల్ ఫుడ్ కోర్టును FSSAI టాస్క్‌ఫోర్స్ టీం రైడ్స్ చేసింది. పరిశుభ్రత పాటించని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జో, ఖాన్‌సాబ్ రెస్టారెంట్లు ఫుడ్ స్టోర్, క్యాలిటీ, నీట్ నెస్ వియషాల్లో FSSAI గైడ్ లైన్స్ ఉల్లంఘింస్తున్నాయని గుర్తించింది. ఆ మూడు హాటల్స్‌కు నోటీసులు ఇచ్చారు. 

అదేవిధంగా కేఎఫ్‌సీ వాడిన ఆయిల్ ను మళ్లీ తిరిగి వాడుతుందని తేలింది. అందులో కచ్చితమైన లాగ్ లను కూడా మెయిన్ టేన్ చేయడం లేదని ఫుడ్ సేఫ్టీ డిఫార్ట్‌మెంట్ ఎక్స్ లో తెలిపింది. స్టార్‌బక్స్, హార్డ్ రాక్ కేఫ్ లు కూడా FSSAI రూల్స్ బ్రేక్ చేశాయని అధికారులు వెల్లడించారు. శుభ్రతా, నాణ్యత విషయాల్లో FSSAI రూల్స్ పాటించని హోటల్స్, రెస్టారెంట్లకు నోటీసులు పంపారు.