నకిలీ విత్తనాలు పట్టివేత

  •     ముగ్గురు అరెస్టు

సూర్యాపేట, వెలుగు: తిరుమలగిరి పరిధిలో 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేదిత గడ్డి మందును టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే  వెల్లడించారు. తిరుమలగిరి పట్టణానికి చెందిన సంకేపల్లి సోమిరెడ్డి, అనంత రెడ్డి, ఈదుల పర్రే తాండకు చెందిన గూగులోతు ప్రేమ్ కుమార్ ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర  నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్నారు. 

పక్కా సమాచారంతో దాడి చేసి వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ రవి, నాగారం సీ‌‌ఐ రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి, అర్వపల్లి ఎస్సైలు సత్యనారాయణ, యాకూబ్, సిబ్బంది ఉన్నారు.