రంగాపూర్ ఎస్ఆర్ రైస్ మిల్లులో తనిఖీలు

  •     రూ.3 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు గుర్తింపు 

హుజూరాబాద్ రూరల్,  వెలుగు : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎస్ఆర్ ట్రేడర్స్ రైస్ మిల్లులో బుధవారం టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లుకు వడ్ల కేటాయింపులు, ఎంత సీఎంఆర్​ఇచ్చారనే దానిపై రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.3 కోట్ల విలువైన 14,805 క్వింటాళ్లు తేడా ఉన్నట్లు గుర్తించారు.

కాగా మిల్లు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికారులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. అయితే మిల్లు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొబ్బల రాజిరెడ్డి నెల రోజుల్లో  బియ్యం, లేదా డబ్బులు ఇస్తానని అధికారులకు బాండ్ పేపర్ రాసిచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో సివిల్ సప్లయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్ కృష్ణ, పెద్దపల్లి డీఎం శ్రీకాంత్ రెడ్డి, హుజూరాబాద్ తహశీల్దార్ విజయ్ కుమార్, డీటీడీఎస్ వసంతరావు, ఎఫ్ఏ వినోద్ కుమార్ పాల్గొన్నారు.