దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్

దేశం సురక్షితంగా ఉండాలంటే, పేదరికం పోవాలంటే మరోసారి మోదీ గెలవలన్నారు  తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్.  నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్  తరుపున ఆమె ప్రచారం నిర్వహించారు. అర్వింద్  రైతు పక్షపాతి అని..  పసుపు బోర్డు సాధించారని తెలిపారు.  అర్వింద్  ముక్కుసూటిగా మాట్లాడతారన్నారని.. ఆయన  తన జీవితాన్ని మోదీ కోసమే అంకితం చేశారని చెప్పారు. అర్వింద్ పై గతంలో పోటీ చేసిన కవిత  ఇప్పుడు జైలులో ఉన్నారని తెలిపారు.  

త్వరలో తెలంగాణలోనూ రామరాజ్యం వస్తుందన్నారు ధర్మపురి అర్వింద్.  మోదీ చేసిన అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా ఉండదన్నారు.  దేశాన్ని రక్షించే మోదీకి 400 సీట్లు గెలిపించి ఇవ్వాలని తెలిపారు.  కాంగ్రెస్ గెలిస్తే బాంబు పేలుళ్లు, మత విద్వేషాలు, లవ్ జిహాద్, మతమార్పిడి, హత్యలు పెరిగిపోతాయని ఆరోపించారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని చెప్పారు.  మందిరాల బీజేపీ ఓట్లు అడుగుతుందని సీఎం రేవంత్ అంటున్నారని..  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిరం నిర్మించుకున్నామని చెప్పారు.