Tamil Nadu: టాటా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  సెప్టెంబర్ 28న ఉదయం  టాటా ఎలక్ట్రానిక్స్  కంపెనీలో   మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి.  భయాందోళనతో కంపెనీలోని ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.   ఉదయంపూట కావడంతో కంపెనీలో  కార్మికులు తక్కువగా ఉన్నారు.

 కంపెనీ సిబ్బంది సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో  సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు.

Also Read:-హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు

 కంపెనీలో చిక్కుకుపోయిన వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా వారిని సురక్షితంగా భయటకు తరలించారు. తీవ్రంగా గాయాలైన ముగ్గురు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు .. సహాయక చర్యలు కొనసాగించేందుకు ఘటనా స్థలం దగ్గర 100 మంది పోలీసులను మోహరించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపింది కంపెనీ యాజమాన్యం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.