ఎంబాకాలం వచ్చింది. బడి పిల్లలు సెలవులతో ఎంజాయ్ చేస్తున్నరు. ఇలాంటి టైంలో చాలా మంది పిల్లల కోసం పరుగులు తీస్తారు. పల్లెల నుంచి పట్టణాల వరకు కాల్వలు, బావులు, చెరువులు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నయ్. ఈత కొట్టే సమయంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నరు. అయితే, ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలి. ఈ విషయంలో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి..
జాగ్రత్తలు ఇలా..
- ఐదేళ్లు దాటిన పిల్లలకే ఈత నేర్పించాలి.
- జ్వరం, జలుబు, చర్మ వ్యాధులున్న పిల్లలను ఈతకు దూరంగా ఉంచాలి.
- మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు ఈతకు వెళ్లకూడదు.
- కొంత మంది నీళ్లలో మునిగి దాక్కుంటారు. ఈ క్రమంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పనులు
- ఉదయం, సాయంత్రం సమయంలోనే ఈత
- కొన్ని చెరువులు, కాల్వలు, గుంతలు, బావుల్లో మెరికలు ఉంటాయి. వాటిని గమనించాలి.
- కాల్వల్లో నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదడం లాంటివి చేయకూడదు.
ఈ సమయంలో తల్లిదండ్రులు దగ్గర ఉండటం మంచిది.
నీళ్లల్లోకి దిగే ముందు..
నీళ్లలో దిగే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఏదైనా తింటే రెండు గంటల తర్వాత ఈతకు వెళ్లాలి. చెవి, ముక్కులోకి నీళ్లు పోకుండా జాగ్రత్తలు
తీసుకోవాలి. ఈత కొట్టేటప్పుడు కళ్లకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ప్రత్యేక దుస్తులతో పాటు తల వెంట్రుకలు కప్పి ఉండేలా హెడ్ క్యాప్ వాడాలి. ఈత కొట్టిన తర్వాత ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవడం మంచిది.
ప్రమాదం జరిగినప్పుడు..
ప్రమాదవశాత్తు నీటిలో మునిగిన వాళ్లను బయటకు తీసిన వెంటనే శ్వాస సక్రమంగా అందేలా చేయాలి. పిల్లలు నీళ్లు తాగితే పొట్ట, ఛాతిపై నెమ్మదిగా ఒత్తిడి పెంచుతూ.. కుడి వైపుకు తిప్పి పడుకోబెట్టాలి. బాధితుడి నోట్లోకి గాలి అందించే ప్రయత్నం చేయాలి. నీట మునిగిన వాళ్ల శరీరం చల్లబడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే వేడిగా ఉండే ప్రాంతానికి లేదా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.