సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీ గడ్డం వంశీ

కోల్ బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వారియర్స్ బాధ్యత తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట్లోని హిందూ గార్డెన్‎లో కాంగ్రెస్ చెన్నూరు, బెల్లంపల్లి సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ గెస్ట్‎గా హాజరైన ఎంపీ వంశీ కృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి విషయాలను చెప్పాలని, సోషల్ మీడియా వారియర్స్‎కు పార్టీ అండగా ఉంటుందన్నారు.  

పార్టీ విధి, విధానాలు, ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.  ఈ సమావేశంలో పార్టీ సీనియర్ లీడర్ బండి సదానందం, సోషల్ మీడియా మంచిర్యాల జిల్లా కో– ఆర్డినేటర్ శశివర్ధన్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఇన్ చార్జ్‎లు సృజన్, వంశీ, మందమర్రి, బెల్లంపల్లి, కన్నేపల్లి, బీమిని, నెన్నల, కోటపల్లి మండలాల కో– ఆర్డినేటర్ లు శశిధర్, వంశీ,రోహిత్, శ్రావణ్, సంతోష్, అనిల్,క్యాతనపల్లి కో – ఆర్డినేటర్ సురేందర్, బెల్లంపల్లి టౌన్ ఇన్ చార్జ్ సాయి తదితరులు పాల్గొన్నారు.