సిద్ధుల గుట్ట అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌‌లోని నవనాథ సిద్ధులగుట్టపై  హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా పిరమిడ్ ను అక్రమంగా నిర్మించారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హిందూ పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఆర్మూర్​ తహసీల్ధార్ గజానన్​కు కలిసి మెమోరాండం అందజేశారు.

పిరమిడ్ నిర్మాణంలో విగ్రహం లేకుండా హిందూ మనోబావాలను దెబ్బతీస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుట్టపైన ఏ నిర్మాణం జరిగినా హిందూ ధ్వజం కచ్చితంగా ఉండాలని, విగ్రహం ఉండాలని డిమాండ్​ చేశారు. హిందూ సంస్థల ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.