కామారెడ్డి డెయిరీ ఎదుట రైతుల ఆందోళన

  • రూ. 3.50 కోట్ల బకాయిలు చెల్లించాలని వినతి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి శివారులోని విజయ డెయిరీ ఎదుట తాడ్వాయి మండల రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. రెండు నెలలుగా రైతులకు పాల బిల్లు రాకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు.  కామారెడ్డి  డెయిరీ పరిధిలో  రైతులకు సుమారుగా రూ.3.50 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.

బకాయిలు ఇవ్వటంతో పాటు ప్రతినెలా సకాలంలో బిల్లులు చెల్లించేలా ఆఫీసర్లు చొరవ చూపాలని కోరుతూ డీడీకి వినతి పత్రం అందించారు.