రామగుండంలో స్వచ్ఛదనం..- పచ్చదనం .. నాటిన ప్రతి మొక్క ఎదగాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన  స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులతో  ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్,  పాల్గొని మొక్కలు నాటారు.  కాలుష్యం అధికంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10 లక్షల మొక్కలు నాటాలన్నారు.  సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో లక్ష మొక్కల పంపిణీ చేసేందుకుకు కార్యాచరణ రూపొందించారు.  నాటిన ప్రతి  మొక్కను తమ వంతు బాధ్యతగా సంరక్షించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.